»Natural Star Nani 30th Movie Shoot Will Start April 3rd In Goa
Nani 30: రేపు నాని 30వ మూవీ షూట్ గోవాలో షురూ!
న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.
న్యాచురల్ స్టార్ హీరో నాని(Nani) తన తాజా చిత్రం దసరా(dasara) విజయం తర్వాత రాబోతున్న చిత్రం నాని 30(#nani30). ఈ చిత్రం జనవరిలో అధికారికంగా ప్రారంభించబడింది. కానీ నాని దసరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటంతో షూటింగ్ కు వెళ్ళలేదు. ఈ క్రమంలో నాని దసరా మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రమోట్ చేశాడు. విడుదలైన తర్వాత హైదరాబాద్, ముంబైల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు కూడా. అయితే దసరా మూవీ 100 కోట్ల మార్కును చేరిన తర్వాత నాని సక్సెస్ వేడుకలో పాల్గొంటారని పలువురు భావిస్తున్నారు. కానీ ఈ క్రమంలో నాని వారందరికీ ట్విస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు.
ఈ క్రమంలో దసరా 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనడానికి ముందే నాని 30వ చిత్రం షూటింగ్ రేపు గోవా(goa)లో ప్రారంభం కానుంది. దీన్ని బట్టి నానికి సినిమా పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొడక్షన్ షెడ్యూల్స్ లేట్ అవ్వడం ఇష్టం లేని న్యాచురల్ స్టార్ షూటింగ్ కోసం వెంటనే గోవా వెళుతున్నాడట. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. ఈ లాంగ్ షెడ్యూల్లో హైదరాబాద్‌లో అభిమానులను కలవడానికి నాని ఒకటి లేదా రెండు రోజులు విరామం తీసుకోవచ్చని అంటున్నారు.
నాని 30 చాలా వరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలిసింది. దసరా(dasara) వంటి పాన్-ఇండియన్ సక్సెస్ తర్వాత ఏ నటుడికైనా మరో కమర్షియల్ చిత్రాన్ని ఎంచుకోవాలని అనిపిస్తుంది. కానీ నాని ఎంపిక మాత్రం పూర్తిగా భిన్నం. నాని కమర్షియల్, స్టార్డమ్కు బదులుగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాడు.
నాని30లో మృణాల్ ఠాకూర్(mrunal thakur) ప్రధాన పాత్రలో నటించనుంది. శౌర్యువ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ ఆంటోని ఎడిటర్.