24/7 dog squad in hyderabad:ఇక హైదరాబాద్‌లో 24 గంటలు డాగ్ స్క్వాడ్ ( dog squad ) అందుబాటులో ఉంటారని మేయర్ గద్వాల విజయలక్ష్మీ (vijayalaxmi) ప్రకటించారు. కుక్కల బెడద నియంత్రణకు సంబంధించి హై లెవల్ కమటీ నివేదిక రూపొందించి మేయర్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. రోజు 400 అధిక స్టెరిలైజేషన్, 31 మంది ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్ల నియామకం, 50 క్యాచింగ్ వాహనాలు ఉన్నాయని చెప్పారు. మరో 10 పెంచుతామని ఆమె ప్రకటించారు. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల చిన్నారి ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దాంతో చర్యలకు ఉపక్రమించారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ (gangadhar) నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్ మెన్‌గా (watchmen) పని చేస్తున్నాడు. భార్య, కూతురు, కుమారుడు కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో ఉంటున్నాడు. గంగాధర్ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్‌కు (service centre) వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అతను అక్కడ ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్ మెన్‌తో కలిసి పని మీద బయటికి వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఆ తర్వాత అక్క (sister) కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దాడి చేసి, ఆ చిన్నారిని చిదిమేశాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేశాయి.
ఆ తర్వాత పలు చోట్ల దాడులు జరిగాయి. దీంతో గ్రేటర్ పాలకవర్గంపై విమర్శలు వచ్చాయి. దీంతో హై లెవల్ కమిటీ వేసి.. నివేదిక అందజేసింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై 24 గంటలు డాగ్ స్క్వాడ్ అందుబాటులో ఉంటాయని మేయర్ తెలిపారు.