Mla Malla Reddy Conversation With Teenmar Mallanna
Mla Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆసక్తికర సంఘటన జరిగింది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురు పడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి (Malla Redd) ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే.. ఎవరో మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సభ్యులు తక్కువయితే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న అడిగారు. అందుకు ఏ మాత్రం తడుము కోకుండా మద్దతు ఇస్తానని మల్లారెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. తర్వాత అందరూ ఒక్కటేనని మల్లారెడ్డి అన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డిపై ఓ కేసు నమోదైంది. భూమి ఆక్రమించారని కేసు ఫైల్ కాగా.. దానిపై మల్లారెడ్డి స్పందించారు. దాంతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే చేరిన.. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగవు. అలాగే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది.