పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. వారు ఎంత పెద్దవారైనా వారిని పార్టీ నుంచి తీసిపారేస్తామని హెచ్చారించారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని, అనవసర హడావుడి చేసి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు. బీఆర్ఎస్ (BRS) సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు. మీరు కూడా పార్టీలోనే ఉండాలి. ‘‘ రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యే (MLA)గా పని చేయడమే కాదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయిని సీఎం తెలిపారు.
చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గతంలో అలా చేశాం కూడా. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణ(Telangana)ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం’’ అని కేసీఆర్ అన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్(Narsapur), జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం (Success) సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.