3D Printed Temple: తెలంగాణలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్
ప్రపంచంలోనే తొలి 3డీ టెంపుల్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సిద్దిపేటలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. రోబోటిక్ మిషన్ సాయంతో ఆలయాలను ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్ లోనే తొలి త్రీడీ టెంపుల్ ఇదే కావడం విశేషం.
ప్రపంచంలోనే తొలి త్రీడీ ఆలయం (3D Printed Temple) ఏర్పాటైంది. అది కూడా ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ (Telangana)లో ఆ ఆలయం రూపుదిద్దుకుంది. రోబోటిక్స్ కన్స్ట్రక్షన్ 3డి ప్రింటింగ్ సాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. తెలంగాణలోని సిద్దిపేట (Siddipet)లో ఈ త్రీడీ ఆలయాన్ని తయారు చేశారు. పూర్తిస్థాయిలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (3D Printing Technology)తో ఆ ఆలయం ప్రింట్ అవుతోంది. రోబోటిక్ మిషన్ (Robotic Mission) సాయంతో ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఒక భవనాన్ని నిర్మించాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు తప్పవు. నిర్మాణాలను పూర్తి చేయాలంటే నెలలు గడవాల్సి ఉంటుంది. అయితే ఆ కష్టాలకు చెక్ పెడుతూ కేవలం గంటల వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తిచేసే టెక్నాలజీ (Technology)తో ఆధ్యాత్మిక టెంపుల్స్‌ను నిర్మిస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి సమీపంలో ఓ ప్రైవేటు విల్లాలో మూడు త్రీడీ ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణ పనులను అప్సూజ కంపెనీ చేపడుతోంది.
ఈ త్రీడీ ఆలయాన్ని (3D Temple) 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. మొదటగా వినాయక ఆలయాన్ని నిర్మించి ఆ పక్కనే శివాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇకపోతే ఆఖర్లో అమ్మవారి ఆలయాలను ఏర్పాటు చేస్తారు. మాన్యువల్‌గా మనుషులు తయారు చేయలేని డిజైన్‌ను కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించనున్నారు. ఈ ఆలయాన్ని ప్రింటింగ్ చేయడానికి 3 నెలలు పట్టిందని, మొత్తంగా గుడి నిర్మాణానికి ఐదున్నర నెలలు పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ గుడి ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్ (World First 3D Temple)గా రికార్డుకెక్కడం విశేషం.