»Medico Preethi Health Is Still Critical Says Nims Doctors
preethi is still critical:విషమంగానే ప్రీతి ఆరోగ్యం.. నిమ్స్ వైద్యుల బులెటిన్
preethi is still critical:మెడికో ప్రీతి (preethi) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ (health bulletein) విడుదల చేశారు. ప్రీతికి ఆధునాతన వైద్యం అందజేస్తున్నామని.. ఆమెను బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స ఇస్తున్నామనివివరించారు.
medico preethi health is still critical says nims doctors
preethi is still critical:మెడికో ప్రీతి (preethi) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ (health bulletin) విడుదల చేశారు. ప్రీతికి ఆధునాతన వైద్యం అందజేస్తున్నామని.. ఆమెను బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స ఇస్తున్నామనివివరించారు. తమ ప్రత్యేక వైద్య బృందం ప్రీతికి జీవం పోసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.
కేఎంసీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ ఎంఎ సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిందని పోలీసులు అంటున్నారు. ప్రీతి- సైఫ్ వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌లను పరిశీలించారు. వాట్సాప్ హిస్టరీ పరిశీలించిన తర్వాత వేధింపులకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. తన కూతురు బతికితే చాలు అని తండ్రి (father) అనడం ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. భిక్షం ఎత్తుకుని అయినా సరే పెంచుకుంటా అని తెలిపారు.
చదవండి:bandi on preethi:లవ్ జిహాదే.. బండి సంజయ్ సంచలనం, రిమాండ్‌కు సైఫ్
ప్రీతిని (preethi) వేధించిన సీనియర్ రెసిడెంట్ సైఫ్‌ను (saif) పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రెట్ ముందు హాజరుపరచగా 14 రోజుల (14 days) రిమాండ్ (remand) విధించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ (ranganath) తెలిపారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని.. దాంతోపాటు ర్యాగింగ్ కూడా కలిపామని చెప్పారు. సైఫ్ కావాలనే ప్రీతిని టార్గెట్ చేశాడని వివరించారు.
సైఫ్ తరచూ ప్రీతిని (preethi) అవమానించడం, చులకన చేసి మాట్లాడటం వల్లే రెండ్రోజుల క్రితం ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌లో (nims) వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కేఎంసీలో అనస్థీషియా విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని సీనియర్ సైఫ్ పదే పదే కేస్ షీట్ విషయంలో నీకు బుర్రలేదంటూ అవమానించడం, వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టి అవమానించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సెన్సిటివ్ అయిన ప్రీతి.. సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు వాట్సాప్ మెసేజ్ తన స్నేహితులకు పెట్టిందని వరంగల్ సీపీ తెలిపారు.