»Medical Student From Telangana Dies In Philippines
Yadadri-Bhongir:ఫిలిప్పీన్స్ లో తెలంగాణకు చెందిన మెడికో స్టూడెంట్ మృతి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri-Bhongir)కు చెందిన మెడికో విద్యార్థి(medical student) ఫిలిప్పీన్స్(philippines) దేశంలో మృతి చెందాడు. 'దవోవ మెడికల్' కాలేజీ( Davao Medical College)లో మెడిసిన్ చేస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
Yadadri-Bhongir: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri-Bhongir)కు చెందిన మెడికో విద్యార్థి(medical student) ఫిలిప్పీన్స్(philippines) దేశంలో మృతి చెందాడు. ‘దవోవ మెడికల్’ కాలేజీ( Davao Medical College)లో మెడిసిన్ చేస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మణికాంత్ రెడ్డి మృతిపై ఫిలిప్పీన్స్ పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి(Bhoodan Pochampally ) మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన మణికాంత్ రెడ్డి ఎనిమిది నెలల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ఏప్రిల్ 23న తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవోవ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మణికాంత్ రెడ్డి(Manikanth reddy) మరణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ లో తెలంగాణకు చెందిన విద్యార్థిని చనిపోయింది. యాదాద్రి భువనగిరి(Yadadri-Bhongir) జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు హైదరాబాద్ వచ్చి ఐఎస్‌సదన్(IS sadan) డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు తేజస్వి. ఆమె హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ బిటెక్ పూర్తి చేశారు. యువతి పై ఉన్నత చదువుల కోసం లండన్(London) వెళ్లి అక్కడే కన్నుమూశారు.