మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి,(Patholla Shasidhar Reddy) సత్తుపల్లి బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్(Matta Dayanand) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే. శశిధర్ చేరికను డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి (Tirupati Reddy) వ్యతిరేకిస్తున్నారు. తనకు కనీస సమాచారం లేకుండా శశిథర్ ను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో తిరుపతి రెడ్డి ఉన్నారు. 2004లో ఆయన మెదక్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
2018 తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. మళ్లీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సత్తుపల్లి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అనుచరుడిగా ఉన్నటువంటి డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, డాక్టర్ రాగ మయి దంపతులు, మాజీ పార్లమెంటు సభ్యురాలు ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (Renuka Chaudhary) ఆధ్వర్యంలో సుమారు 500 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది సన్నద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.