Kunamneni samba shiva rao: కేంద్రం ఆ విషయంలో కుట్ర చేస్తోంది!
దేశంలో బీజేపీ పాలకులు ఉన్మాద రాజకీయాలను అవలంభిస్తోందని, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
దేశంలో బీజేపీ పాలకులు ఉన్మాద రాజకీయాలను అవలంభిస్తోందని, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ లో నిర్వహించిన సీపీఐ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయం, ఫాసిస్టు భావజాలం పౌర సమాజంలో చొప్పిస్తు దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు.
మోడీ పాలన ప్రజా అనుకూలం కాకపొగా ప్రజావ్యతిరే కమైందని అన్నారు. దేశానికి అచ్చా దిన్ రాలేదని పేర్కొన్నారు. విదేశాలలో ములుగుతున్న నల్లధనాన్ని తీలేదని, ప్రజలకు పంచలేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుచేసి దేశంలో నల్లధనం వెలికి తీస్తానన్నది జరగలేదని వారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి పోయి ప్రజలపై భారం మోపిందని అన్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు. భారత జాతీయ వాదం దేశ పౌరులందరిని సమానంగా చూస్తుందని, హిందూ జాతీయ వాదం ఈ దేశం హిందువులది మాత్రమేనని ఇతరులు పరాయి వారిగా చిత్రీకరించి బిజెపి విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. బిజెపి మనువాదంకు వ్యతరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాటాలను ఉదృతం చేయాలని, అందుకే సిపిఐ భారతదేశ వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ పోరాటాలకు సమాయత్తమవుతుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇంటింటికి సిపిఐ పేరుతో లక్షణాది ప్రజలను కలుసుకోవడం జరిగిందని అన్నారు.