»Ktr Defeat Is Nothing New To Us Its Like A Speed Breaker
KTR: ఓటమి మాకు కొత్తేమీ కాదు.. స్పీడ్ బ్రేకర్ లాంటిదే!
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చిందని అందరు అంటున్నారు. కానీ అవి 420 హామీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టామని తెలిపారు.
KTR: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చిందని అందరు అంటున్నారు. కానీ అవి 420 హామీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరన్నారు. ప్రజలు తప్పు చేశారని అనడం సరైనది కాదని.. పార్టీ నాయకులు అలా మాట్లాడకూడదని కేటీఆర్ అన్నారు. రెండుసార్లు బీఆర్ఎస్ను గెలిపించింది కూడా మన ప్రజలే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టే వైఖరిని ప్రదర్శిస్తోందని కేటీఆర్ తెలిపారు.
అధికారం కోసం అలవిగాని హామీలిచ్చారు. ఇప్పుడు అవి అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. యాసంగి వరి నాట్లకు ఎదురుచూస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించారు. రైతుబంధు ఆపేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శమని తెలిపారు. ఓటమి తమకు కొత్తేం కాదని.. అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలని సూచించారు. పదేండ్లపాటు విరామమెరుగక పనిచేసని కారు.. మరింత స్పీడ్‌గా వెళ్లేందుకు సర్వీసింగ్‌కు పోయిందని కేటీఆర్ అన్నారు.