Baba Fasiuddin : బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్
జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు.
Baba Fasiuddin : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో విభేదాల కారణంగానే ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు సమాచారం. గురువారం సాయంత్రం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
అంతకు ముందు బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు. పార్టీ కోసం ఇరవై రెండేళ్లుగా సైనికుడిలా కష్టపడి పని చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు రక్షణ కరువైందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేవన్నారు. పార్టీలో కష్టపడి పని చేశానని.. అలాంటి తనకు కొంతమంది నాయకులు రాజకీయ భవిష్యత్తు లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతోందని తెలిసిందని… ఈ విషయాన్ని వెంటనే అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదన్నారు.