»Komatireddy Venkat Reddy Made Sensational Comments 2
Communistలతో పొత్తు అవసరం లేదు: కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.
Komatireddy Venkat Reddy Made Sensational Comments
Komatireddy Venkat Reddy: కమ్యునిస్టులతో పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ సీట్ల ప్రకటన జరగగా.. తాము అడిగిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఏ సీట్లు ఇస్తారోనని కామ్రేడ్లు ఎదురు చూస్తున్నారు. ఇంతలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి.
కమ్యూనిస్ట్ పార్టీలకు నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని వెంకట్ రెడ్డి అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెప్ట్ పార్టీలుకు చెరో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. మంత్రివర్గంలోకి తీసుకుని.. రెండు మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చెప్పానని పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అవసరం అని వెంకట్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వారికి ఆ సీట్లు కేటాయిస్తే.. బీఆర్ఎస్ గెలిచే ప్రమాదం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 75 సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు. కొన్ని సర్వేలు మాత్రం హంగ్ అంటున్నాయని పేర్కొన్నారు. సో.. ఇలాంటి సమయంలో 4 సీట్లు కూడా ఇంపార్టెంట్ అవుతుందన్నారు. ఆ పార్టీలకు సీట్లు కేటాయిస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఇంత చెప్పినప్పటికీ కమ్యూనిస్టులు సీట్లు అడిగితే తాము పొత్తుకు వ్యతిరేకం అని వెంకట్ రెడ్డి అంటున్నారు.