మునుగోడు ఎన్నికల నేపథ్యంలో…. ఇటీవల కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా… ఆ నోటీసులకు ఆయన తాజాగా సీల్డ్ కవర్ లో సమాధానం పంపడం గమనార్హం.
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని.. తన తమ్ముడిని రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్స్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. నాడు మొదటి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గతనెల 22న అధిష్టానం ఈ నోటీస్ ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న వెంకటరెడ్డి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇక ఆస్ట్రేలియా లో అక్కడివారితో నేరుగా ఓడిపోయే సీట్ కు ప్రచారం అవసరమా అనడంతో వెంకటరెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్న వెంకటరెడ్డి కాంగ్రెస్ తోనూ ఎన్నిక సందర్బంగా కొంత దూరం జరిగారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు ఆయనపై చర్యలకు కాంగ్రెస్ దిగింది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి తరుఫున ప్రచారంలో పాల్గొనకుండా తమ్ముడి కోసం పనిచేసిన కోమటిరెడ్డి వ్యవహారంతో ఇప్పుడు అతడిని పార్టీ నుంచి సాగనంపే చర్యలు ఊపందుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అధిష్టానం పంపిన నోటీసుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. సీల్డ్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ‘అది ఫేక్ ఆడియో అని.. నా వాయిస్ కాదు. మార్ఫింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ ను.. కాంగ్రెస్ లో విద్యార్ధి విభాగం నుంచి పనిచేశా..దాదాపు 35 ఏళ్లుగా కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్నా.. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు’ అంటూ వెంకటరెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. మరి వెంకటరెడ్డి సమాధానికి ఏఐసీసీ సంతృప్తి చెందుతుందా ? లేదా? అనేది మరికొద్దిరోజుల్లో