Delhi Liquor Case: విచారణ తర్వాత కవిత అరెస్ట్? ఈడీ అదే చేయనుందా?
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడీ(ED) నోటీసులు పంపింది.

మరోవైపు ఈడీ(Enforcement Directorate) నోటీసులపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బుధవారం స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. అదే సమయంలో తనకు నోటీసులు ఇవ్వడం వల్ల కేసీఆర్(KCR)ను, బీఆర్ఎస్ (BRS) పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ(BJP)కి చురకలంటించారు.
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)లో ఈడీ 11 మందిని అరెస్టు చేయగా వారంతా తీహార్ జైలులో ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu)కు మాత్రం సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడి బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం ఈడీ అరెస్టు చేసింది. దీంతో బీజేపీ(BJP) నేతలంతా కూడా తర్వాత అరెస్ట్ అయ్యేది కవితేనని అంటున్నారు.
ఈడీ(Enforcement Directorate) పంపిన నోటీసుల ప్రకారంగా చూస్తే రేపు కవిత వారి ముందు విచారణకు హాజరు కావాలి. ఈ విషయంలో తన తండ్రి సీఎం కేసీఆర్ తోనూ ఆమె మాట్లాడారు. ఆందోళన పడాల్సిన పనిలేదని కేసీఆర్(KCR) తన కూతురుకు తెలిపారు. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ సాధనకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఏర్పాట్లపై కవిత ఢిల్లీ వెళ్లినట్లుగా పలువురు నాయకులు చెబుతున్నారు. అయితే ఆమె విచారణకు హాజరవుతారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. మరోవైపు మరికొందరు రేపు విచారణ అనంతరం కవిత(Kavitha)ను అరెస్టు చేస్తారని చెబుతున్నారు.