»Is This The Emblem Of Telangana State Why Postpone The Unveiling
Telangana State Emblem: తెలంగాణ రాజముద్ర ఇదేనా.. ఆవిష్కరణ ఎందుకు వాయిదా
తెలంగాణా అవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జాతీయ గీతంతో పాటు, రాజముద్రను అవిష్కరించబోతున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ పాటికే ఇదే రాజముద్ర అంటూ ఒ ముద్ర సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Is this the emblem of Telangana state.. Why postpone the unveiling?
Telangana State Emblem: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర అధికారిక ముద్రను మార్చాలి అని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న రాజముద్రలో రాచరికపు పోకడాలు ఉన్నాయి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని అధికారిక ఎంబ్లెమ్లో కాకతీయ తోరణం లాంటి రాజుల ఆనవాల్లు లేకుండా చేస్తామన్నారు. దాని స్థానంలో అమరివీరుల త్యాగాల గుర్తు, కష్టజీవుల గుర్తులతో కొత్త ఎంబ్లెమ్ తయారు చేస్తామన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజముద్రను అవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వుం అవిష్కరించనున్న రాజముద్ర ఇదేనని ఓ ఎంబ్లెమ్ వైరల్ అవుతుంది. దానిలో అమరవీరుల స్థూపం, దానిపైన సత్యమేవ జయతి పేరుతో జాతీయ చిహ్నం ఉంది. ఇక వ్యవసాయానికి గుర్తుగా పంట గొలుసుతో పాటు ఎరుపు, ఆకుపచ్చ సర్కిల్స్ కూడా ఉన్నాయి. ఈ లోగోతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా అవిష్కరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత లోగోలో ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్ బొమ్మలను తొలగించడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోగో అవిష్కరణ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజముద్రపై ఇంకా చర్చ సాగుతుందని, మరిన్ని సంప్రదింపులను తీసుకొని సరికొత్త లోగోను తయారు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రగీతంపై మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే.