Minister KTR : ముసలోడిని అయిపోయా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్
హైదరాబాద్లోని బంజారా భవన్లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ యూనిట్లను పంపిణీ చేశారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను ముసలోడిని అయిపోయా…47 సంవత్సరాలు వచ్చాయి. జుట్టుకు రంగు వేసుకున్నానని ఆయన తెలిపారు.హైదరాబాదు(Hyderabad)లోని బంజారా భవన్లో ఏర్పాటుచేసిన సీఎంఎస్టిఈఐ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇండియాలో కులాలు, మతాలు అని సమాజాన్ని మనుషులే భిన్నంగా విభజించుకున్నామన్నారు. కరోన (corona) విశ్వమానవాలిని ఏకం చేసిందని, కులం, మతం దేవుడు పుట్టించలేదు. మనకు మనం తయారు చేసుకుందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు చేసినప్పుడు కుల, ధన బలం లేదని, కేసీఆర్ ఉద్యమాన్ని కేవలం తన వాక్శుద్ధితోనే ప్రారంభించారన్నారు.
కేంద్రంలో బీజేపి(BJP), తెలంగాణలో బీఅరెస్ ప్రభుత్వానికి 9ఏళ్ళు పూర్తి అయిందన్నారు. కేంద్రం తలసరి ఆదాయం ఎట్లా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం ఎలా ఉందో కేంద్రం చెప్పాలని, పంచాయితీ రాజ్ శాఖ (Panchayat Raj Department) కు కేంద్రం 30 అవార్డులు ఇచ్చింది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇలా పనితీరు ఎందుకు లేదని ప్రశ్నించారు. మతాలు, కులాల పేరు మీద పనికిమాలిన పంచాయితీలు పెడితే అభివృద్ధి జరగదన్నారు. జీవితం చాలా పరిమితం.. వెయ్యి ఏళ్ళు బతకడానికి పుట్టలేదన్నారు. భారత్ దేశం (INDIA) పోకస్ అంతా కులం, మతం పై మాత్రమే ఉందని మండిపడ్డారు. నిన్న ఒకాయన వచ్చిన పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి పోయారని, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ విమర్మించారు.