సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన కామెంట్స్ చేశారు. భారతీయ జనత పార్టీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ (ED, CBI) విచారణలు సర్వసాధరమేనని మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటానే వదిలేస్తారని...లేదంటే జైల్లో వేస్తారని నారయణ విమర్మించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ (BJP) ఉద్ధేశ్యమని..ప్రశ్నించినా..ఎదిరించి విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి అలవాటేనని ఆయన తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన కామెంట్స్ చేశారు. భారతీయ జనత పార్టీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ (ED, CBI) విచారణలు సర్వసాధరమేనని మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటానే వదిలేస్తారని…లేదంటే జైల్లో వేస్తారని నారయణ విమర్మించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ (BJP) ఉద్ధేశ్యమని..ప్రశ్నించినా..ఎదిరించి విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి అలవాటేనని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుఅయ్యారు. దీంతో ఢిల్లీలో (Delhi) టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియాతో, అరుణ రామచంద్ర పిళ్లైతో పాటు కవితనకు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవితతో పాటు ఏడుగురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం ఐదుగురు ఈడీ (ED)అధికారుల బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కవిత (Kavitha) నుంచి వచ్చిన సమాధానలను బట్టి ఆమెను అరెస్టు చేస్తారా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది. బీజేపీ (BJP) తనకు వ్యతిరేకంగా ఉండేవారిని వెంటాడడం వేటాడడం చేస్తుందని ఇది అనాగరికమని ఆరోపించారు. శత్రుశేషం లేకుండా చేయటమే బీజేపీ (BJP) ఉద్ధశ్యమని అటువంటి బీజేపీపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈడీలు,సీబీఐలు ఎంతమంది వచ్చినా బెదరకుండా పోరాడాలని తెలిపారు నిరుత్సాహపడకూడదని ధైర్యంగా పోరాడుతు ముందుకుపోవాలని సూచించారు. సమస్యలు వచ్చాయని భయపడితే మరింతగా భయపెట్టటం..బెదిరించటం బీజేపీ నైజం అని అటువంటి అహంకారపూరిత బీజేపీపై ప్రతీ ఒక్కరు పోరాడాలని నారాయణ సూచించారు.