OPPO Reno 9 5G:భారత మార్కెట్లోకి ఒప్పొ రెనో 9 5జీ (OPPO Reno 9 5G) రాబోతుంది. వచ్చే నెల 1వ తేదీన మొబైల్ లాంచ్ చేస్తారని సమాచారం. మొబైల్ ధర కూడా మిడ్ రేంజ్లో ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ (5g sims) వాడుకునే వెసులుబాటును కల్పించారు. మార్కెట్లో మొబైల్ ధర రూ.30 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.
OPPO Reno 9 5G:భారత మార్కెట్లోకి ఒప్పొ రెనో 9 5జీ (OPPO Reno 9 5G) రాబోతుంది. వచ్చే నెల 1వ తేదీన మొబైల్ లాంచ్ చేస్తారని సమాచారం. మొబైల్ ధర కూడా మిడ్ రేంజ్లో ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ (5g sims) వాడుకునే వెసులుబాటును కల్పించారు. మార్కెట్లో మొబైల్ ధర రూ.30 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. మొబైల్ 8జీబీ ర్యామ్‌తో (8gb ram) వస్తోంది. గేమింగ్ ఆడుకునేవారికి చక్కగా పనిచేస్తోంది. అలాగే స్టోరెజ్ 256 జీబీ ఇచ్చారు. స్టోరెజ్ ఎక్స్పండ్ చేసుకునే అవకాశం లేదు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఇచ్చారు. అక్టా కోర్ మీద పనిచేస్తోంది. అడ్రెనో 642 ఎల్ గ్రాఫిక్స్ ఫీచర్ ఉంది.
అమోలెడ్ డిస్ ప్లే (amoled display) కాగా.. స్క్రీన్ 6.7 ఇంచులు ఉంటుంది. ఇన్ ఫింగర్ ఫ్రింట్ డిస్ ప్లే (in finger print display) ఉంది. వెనకాల డ్యుయల్ కెమెరా ఏర్పాటు చేశారు. 64 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ ప్రైమరీ డెప్త్ కెమెరా ఆమర్చారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ వస్తోంది. డిజిటల్ జూమ్, ఆటో ప్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ అనే నాలుగు కెమెరా ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ వీడియో రికార్డింగ్ చేసే ఆప్షన్ ఇచ్చారు.
4500 సామర్థ్యంతో లీ-పాలిమర్ నాన్ రీమూవల్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు వచ్చే మొబైళ్లలో అన్నీ నాన్ రీమూవబుల్ బ్యాటరీలేనని సంగతి తెిలసిందే. 67 వాట్లతో క్విక్ చార్జర్ ఇచ్చారు. కేవలం 44 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జీంగ్ అవుతుంది. డ్యుయల్ 5జీ సిమ్ వేసుకునే అవకాశం ఉంది. వైఫై కనెక్ట్ అవుతుంది. బ్లూ టూత్ 5.2 ఆప్షన్ ఇచ్చారు. మొబైల్ హైట్ 162.3 మి.మి కాగా.. విడ్త్ 74.2 మిమి.. థిక్ నెస్ 7.1గా ఉంది. మొబైల్ బరువు 174 గ్రాములు ఉంది. మొబైల్ బ్లాక్ (black), బ్లూ (blue), రెడ్ (red), గ్రేడియంట్ (gradiant) కలర్స్‌లో లభిస్తోంది.