హైదరాబాద్ (Hyderabad) సైంటిస్టులు అద్బుత ఆవిష్కరణ చేశారు.నోటి క్యాన్సర్లను స్మార్ట్ ఫోన్ తో గుర్తించే టెక్నాలజీని భాగ్యనగర ట్రిపుల్ ఐటీ(Triple IT)లోని ఐహబ్, ఐఎన్ఐఏ ప్రతినిధులు కనుగొన్నారు.స్మార్ట్‌ఫోన్‌తో నోటి కుహరం వద్ద ఫోటోలు తీస్తేచాలు.. ఫోన్లో అమర్చని ఏఐ సాఫ్ట్వేర్ (AI software) క్యాన్సర్‌ను పసిగడుతుంది. క్యాన్సర్ (Cancer) ఉందా? లేదా? అని గుర్తించి నిమిషాల్లోనే చెప్పేస్తుంది. అంతేకాదు. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఉందా? తీవ్రంగా మారిందా? అనేది కూడా విశ్లేషించి డేటాను వెల్లడిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నోటి క్యాన్సర్ (Oral cancer) ను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలిపారు.
ఈ ఎక్స్ పరిమెంట్ కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సహకారం అందించగా త్వరలో తెలంగాణలోని ప్రభుత్వ వైద్యులకు ఈ ప్రత్యేక స్మార్ట్ ఫోన్(Smart phone)ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక దీని పనితీరు గురించి సైంటిస్టులు స్పందిస్తూ.. బయాప్సీ(Biopsy) అవసరం లేకుండానే నోటి కుహరంలో గాయాలు, చిన్న కణితల్లో రక్తస్రావం వంటి వాటిని స్మార్ట్ ఫోన్ ఫోటోలు తీస్తుందని వెంటనే ఏఐ క్యాన్సర్ దశను తెలుపుతుందని పేర్కొన్నారు.వాస్తవానికి నోటి క్యాన్సర్ గుర్తించేందుకు బయోస్పీ చేయాల్సి ఉంటుంది. బయోస్పీ ద్వారా నోటి కుహరంలోని పండ్లు, కణితుల(Tumor)ను పరిశీలిస్తారు. దీన్ని బేస్ చేసుకుని.. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పరిశోధకులు. క్యాన్సర్ లక్షణాలను ఫోటో ద్వారా గుర్తించే అంశంపై ప్రయోగం చేయాలని తలించారు.