తెలంగాణలో ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగ ఎంతో ప్రత్యేకం. ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం పెట్టి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండగా వెనుక 150 సంవత్సరాల చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
Bonal: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో మొదలయ్యే ఈ వేడుకను ప్రతి ఇంట కోలాహలంగా జరుపుకుంటారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కెటాయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేలా చూస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జూలై 17 సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నెలరోజుల పాటు మూడు దశల్లో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. దీనిలో భాగంగా మొదటిగా గొల్కోండ బోనాలు నిర్వహిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఇక గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం పెట్టి ఆ తరువాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు జరుపుతారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చాలా ఫేమస్. అనంతరం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలతో ఇవి ముగుస్తాయి.
అయితే ఈ బోనాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది. 150 సంవత్సరాల క్రితం పెద్ద కలరా వ్యాప్తి తరువాత ఈ పండుగను మొదటిసారి జరుపుకున్నారని సాధారణంగా నమ్ముతారు. అలాగే బ్రిటిష్ కాలంలో వారిదగ్గర పనిచేసే సురటి అప్పయ్య అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతానికి బదిలి చేశారట. ఆ సమయంలో 1813లో సికీంద్రబాద్ లో ఏదో వ్యాధి రావడంతో ప్రజలు అల్లకల్లోలం అయ్యారట. అప్పుడు వ్యాధిని నిర్ములించమని ఉజ్జాయిని మహంకాళిని వేడుకున్నాడట. ఇక అప్పటి నుంచి లష్కర్ బోనాలు ప్రతీ ఏట జరగుతున్నాయి. ఇక ఈ ఉత్సవాలు ఆషాడమాసంలో జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో ఆడబిడ్డలు ఇంటికి వస్తారు. ఆ సంతోషంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు అనేది కూడా ఉంది. అలాగే ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉంది. ఇది వర్షకాలం అనేక క్రిమికీటకాలు తిరిగే కాలం, వాటి నుంచి రక్షణ పొందెందుకు పసుపు, కుంకుమ, వేపాకులతో పూజలు చేస్తే అవి నశిస్తాయి అని నమ్మకం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పండుగను ఘనంగా జరుపుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. తెలంగాణలో కూడా బోనాల పండుగకు ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.