»Good News For Farmers Government Has Released Rs 1000 Crores
Telangana: రైతులకు శుభవార్త..రూ.1000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇందుకోసం బుధవారం రూ.వెయ్యి కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించింది.
తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. బ్యాంకుల నుంచి పలు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బుధవారం వరకు 21.35 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసింది. అంటే ఇప్పటి వరకూ రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించింది.
తాజాగా ప్రభుత్వం బుధవారం రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీంతో రుణమాఫీ ప్రక్రియ మరింత వేగం కానుందని, రెండో విడత రుణమాఫీని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపింది. మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వ నిశ్చయించుకుంది. రాబోయే రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలిపింది.