ERC : కరెంట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈఆర్సీ కీలక నిర్ణయం..
విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ (ERC) గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు (Chairman Sri Ranga Rao) తెలిపారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు.
విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ (ERC) గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు (Chairman Sri Ranga Rao) తెలిపారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ (Telanagna) ప్రభుత్వం డిస్కంలకు రూ. 12,718.40 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించిందని, దీనికి ఈ రోజు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఆమోదించబడిందని ఆయన వెల్లడించారు.
ట్రూ-అప్ ఛార్జీలు (True-up charges) గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విద్యుత్ చార్జీలు (Electricity charges)19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీల యూనిట్కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ.. ఇతర వినియోగదారులకు యూనిట్కి రూపాయి చొప్పున చార్జీల మోత మోగింది. అలాగే డొమెస్టిక్ వినియోగదారులపై (Domestic users) కొత్తగా ఫిక్స్డ్/ కస్టమర్ చార్జీలు విధించగా.. ఇతర వినియోగదారులపై కూడా అప్పటికే ఉన్న చార్జీలు పెరిగాయి. అయితే.. ఈ గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల మోత తప్పదని అందరూ భావిస్తుండగా.. ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం.. ప్రజలపై కొంత భారం తప్పుతుందని అంటున్నారు.