»Gold Chocklates Seized In Shamshabad Airport Hyderabad
Gold Smuggling: మీ తెలివి తగలెయ్య.. చాక్లెట్లలో బంగారం ఏందిరా
దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి.
Gold Smuggling: దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి. దీంతో విదేశాలనుంచి తెచ్చి కేటుగాళ్లు ఇక్కడ అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల నుంచి ఇండియా(India)కు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారులు(Officers) ఎన్ని చర్యలు చేపట్టినా బంగారం అక్రమ రవాణా(Gold Smuggling) ఆగడం లేదు. రకరకాల పద్ధతులలో స్మగ్లర్లు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు.
పేస్టు(Paste) రూపంలో ఉన్న బంగారాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, మనిషి ప్రైవేట్ భాగాల్లో పెట్టుకుని తెస్తున్నారు. పాదరక్షలు(Cheppal), లగేజ్ బ్యాగు(Bags)ల ప్రత్యేక లేయర్లలో బంగారం తెస్తున్నట్లుగా ఇటీవల పలు కేసుల్లో బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టు(shamshabad airport)లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారు 13 బంగారాన్ని చాకెట్ల రూపంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారి సామాగ్రిని అధికారులు తనిఖీ చేశారు. చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించి తీసి చూడగా అవన్ని బంగారు చాక్లెట్లు(chocklates)గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 269 గ్రాములు బరువైన 13 చాక్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు 16.5లక్షలు ఉంటుందని తెలిపారు.