»Gangavva Visit The Telangana Secretariat After Shocked Video Is Viral Abd Brs Leader Posted The Video Gangavva Also Impressed The Telangana Secretariat
Gangavva: సెక్రటేరియట్ చూసి గంగవ్వ షాక్
యూట్యూబర్ అనిల్‌తో కలిసి గంగవ్వ హైదరాబాద్ వచ్చింది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని ఆశ్చర్యపోయింది. వైరల్ అవుతున్న వీడియోను బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Gangavva: మై విలేజ్ షోతో తెలుగు వారికి పరిచయం అయిన గంగవ్వ.. బిగ్ బాస్ షోతో మరింత చేరువ అయ్యింది. సోషల్ మీడియాను ఉపయోగించడం కూడా గంగవ్వకు తెలియదు. ఆమె వీడియోలు మాత్రం యూట్యూబ్‌లో కనిపిస్తూనే ఉంటాయి. యూట్యూబర్ అనిల్ గీలాతో కలిసి గంగవ్వ హైదరాబాద్ వచ్చింది. తెలంగాణ సచివాలయం, అమరుల స్థూపం, ట్యాంక్ బండ్, చార్మినార్‌ను చూసి గంగవ్వ ముచ్చటపడింది. ఆ వీడియోలో గంగవ్వ మాటలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Gangavva, the iconic Telangana actress, has been instrumental in bringing the region's unique "Vesha Bhashalu" (Telangana dialect) into sharp focus. 🎞 🎥
తెలంగాణ సచివాలయం లోపలికి ప్రవేశించిన తర్వాత ‘ఇంత పెద్ద భవనమా.. నా అరవై నాలుగేళ్ల జీవితంలో ఇంత పెద్ద బిల్డింగ్‌ను ఎప్పుడు చూడలేదు. ఇది చూడటానికి ఒక రాజభవనంలా ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్‌ను ఎలా కట్టారని గంగవ్వ ఆశ్చర్యపోయింది. సచివాలయంలోకి పోనివ్వరని అన్నావు కదా అనిల్.. నన్ను చూసి లోపలికి పంపించారు. గంగవ్వ అంటే ఏం అనుకున్నావు ‘ అంటూ అనిల్‌తో సంభాషించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తెలంగాణ అభివృద్ధిని చూసి గంగవ్వ కూడా ఆకర్షితరాలవుతుంది’ అని ట్వీట్ చేయగా.. ఎవరైనా ఈ భవనం చూసి షాక్ అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.