»For Renovation Of Karnataka Sahitya Mandir Rs 5 Crores Cm Kcr
CM KCR : కర్ణాటక సాహిత్య మందిరం పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లు : సీఎం కేసీఆర్
హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కన్నడిగుల కోసం హైదరాబాద్‌లో గల సాహిత్య వేదికను పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటక వాసులు, అంబర్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్( Kaleru Venkatesh )విజ్జప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలో గల కర్నాటక సాహిత్య మందిరం( Karnataka Sahithya Mandir ) పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. కాగా తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శుక్రవారం నాడు ప్రగతి భవన్లో కలిసి కృతజ్జతలు తెలిపారు.