WNP: నీటిపారుదల శాఖ కార్యనిర్వహక ఇంజనీరుగా పూజారి మధుసూదన్ రావు జిల్లా రైతులకు సాగునీరు అందించడంలో సమర్థవంతంగా కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. శుక్రవారం మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన తమ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.