ADB: ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ కు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో వికాస్ మోజే వద్దనున్న రూ.4,15,000 దోపిడి దొంగలు తీసుకొని పారిపోయారు. ఈ మేరకు వారిని వికాస్ మోజే వెంబడించి వీడియోని చిత్రీకరించారు. బాధితుడిపై నిందితులు దాడి చేసే క్రమంలో పోలీసు సిబ్బందికి సమాచారం అందజేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 24 గంటల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.