KMR: దోమకొండ మండలం సీతారాంపల్లిలో ఇవాళ తెల్లవారుజామున పిడుగు పడటంతో చెరుకు సిద్ధరాములు చెందిన గేదె మృతి చెందింది. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర నష్టపోయామన్నారు. అకాల వర్షాలు, పిడుగు పాటు వల్ల నష్టం జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.