KMM: జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. రాపర్తినగర్ వద్ద ఓ టిఫిన్ సెంటర్లో శానిటరీ సూపర్వైజర్ ఎం.సాంబయ్య తనిఖీ చేయగా, హోటల్లోని ఫ్రిడ్జ్ తలుపులకు ఫంగస్, నిల్వ ఉన్న చట్నీలోనూ బూజు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు హోటల్ నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించి, తీరు మార్చుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.