NLG: నల్గొండ పట్టణంలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పశుసంవర్ధక, మున్సిపల్, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.