నల్గొండ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించినందున ఈనెల 30, 31వ తేదీల్లో నల్గొండలో నిర్వహించాల్సిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.