వరంగల్లో ప్రభుత్వం కేటాయించిన 101 ఎకరాల స్థలంలో నిర్మించిన నూతన పరిపాలన భవనాన్ని జైలు శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైళ్ల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జైలు శాఖ పీడీఎఫ్ వనరులతో ఈ భవనం నిర్మించబడిందని తెలిపారు.