NZB: ఉపాధి హామీ కూలీలు ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలను పాటించాలని ఎంపీడీవో చింత రాజు శ్రీనివాస్ సూచించారు. సోమవారం జిల్లా కమ్మర్పల్లిలోని మండలకేంద్రంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు ఆయన ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎండలో పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుని ఓఆర్ఎస్ ద్రావణం సేవించాలని సూచించారు.