ADB: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మధుప్రియ చదరంగంలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి కలెక్టర్ చేతుల మీదుగా అందుకొని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.