BDK: దమ్మపేట జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన పిల్లల భద్రత – డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవగాహన సదస్సులో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి సాగుతున్న డ్రగ్స్ నెట్వర్క్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.