NZB: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికివాడల్లోని ప్రజలు ఇళ్లు, రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి మైనారిటీ స్లమ్ డివిజన్లో 400 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.