GDWL: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గద్వాల జిల్లా అయిజకు చెందిన విద్యార్థి రాము, నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 954 మార్కులు సాధించి అందరినీ కంటతడి పెట్టించాడు. మార్చి 17న గద్వాలలో జరిగిన ప్రమాదంలో రాము అక్కడికక్కడే మరణించాడు. ఫలితాల్లో రాము ప్రతిభ చాటినప్పటికీ, అతను లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.