NZB: ఇందల్వాయి తహసీల్దార్ బుధవారం జీపీవోలతో సమావేశం నిర్వహించారు. రేపు జరగబోయే గ్రామ సభల గురించి, ప్రభుత్వ పథకాలు (కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్) ప్రజలకు వివరించవలసిన విధి విధానాల గురించి తెలియజేశారు. తక్షణమే విచారణ చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని తహసీల్దార్ తెలిపారు.