MDK: జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నందున జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు జరగవని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో ఎల్1, ఎల్2 పద్ధతి అనుసరించడంతో, దానిని వ్యతిరేకిస్తూ బందు చేస్తున్నట్లు తెలిపారు. మిల్లులు బంద్ ఉన్న కారణంగా పత్తిని తీసుకురావద్దన్నారు.