జగిత్యాల టౌన్-3 సెక్షన్ విద్యుత్ శాఖ ఏఈ బీ.ప్రవీణ్ ఆధ్వర్యంలో స్థానిక వాణి నగర్లో గురువారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలకై 1912 టోల్ ఫ్రీ సంప్రదించాలని ఏఈ కోరారు.