HYD: GHMC వ్యాప్తంగా అధికారులు సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా ఖైరతాబాద్ పరిధిలోని సంత్ నిరంకారీ భవన్ జంక్షన్ వద్ద సుందరీకరణ పనులు పూర్తి చేశారు. తాజాగా ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేయడంతో స్థానిక పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. చూపరులను ఆకర్షిస్తుంది. దీంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా కొంతమేర తగ్గిందని స్థానికులు, వాహనదారులు తెలిపారు.