నిజామాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య బృందం తనిఖీ చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రస్ట్ డా.తంగ్, డా.ఫ్రాన్సిస్ జబీర్ నేషనల్ హెల్త్ మిషన్ అమలు తీరును పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరికరాలు, వసతుల వివరాలు సేకరించారు. వారి వెంట సూపరింటెండెంట్ డా.రవీంద్ర మోహన్, పద్మజ ఉన్నారు.