BDK: మణుగూరు నుండి ఏటూరు నాగారం వరకు ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని సామాజిక కార్యకర్త లాయర్ కర్ణ రవి సోమవారం జరిగిన ప్రజావాణిలో అధికారులను కోరారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. వాహనదారుల ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని అన్నారు. బొగ్గు, ఇసుక లారీల వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పారు.