KKD: శంఖవరం మండల వ్యాప్తంగా నేటి నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 21న మండపం, వేళంగి, పెదమల్లాపురం, 22న శంఖవరం, గౌవరంపేట, 23న వజ్రకూటం, 24న జి. కొత్తపల్లి, కత్తిపూడి, సీతంపేట, అన్నవరం, 25న ఎస్. జగ్గంపేట, 27న నెల్లిపూడి, కొంతంగి గ్రామాల్లో ఆయా పంచాయతీ భవనాల వద్ద సభలు జరుగుతాయని వెల్లడించారు.