HYD: అనుమానం పెనుభూతమై.. ఓ నిండు చూలాలు, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. కాచిగూడకు చెందిన సత్యనారాయణ, కాప్రాకు చెందిన స్నేహకు ఓ బాబు ఉన్నాడు. గొడవల నేపథ్యంలో కొద్ది నెలలు దూరంగా ఉన్నారు. ఆమె 7 నెలల గర్భవతి అని అతడికి తెలిసింది. అనుమానంతో భార్యకు మద్యం తాగించి.. ఆమె కడుపుపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.