BPT: అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులను కల్పిస్తామని ఎంపీడీవో అద్దురి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం పేరలిలో మంగళవారం జరుగుతున్న మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని, కూలీల నమోదు పక్కడ్బందీగా ఉండాలన్నారు.