విశాఖ: చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని వార్డు సభ్యులు లింగరాజు డిమాండ్ చేశారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈమేరకు గ్రామ పెద్దలు, గ్రామస్తులతో కలిసి సొంతంగా శ్రమదానంతో గ్రామంలో రేకుల షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. అధికారులు పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.