కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిని ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ముమ్మిడివరం MLA దాట్ల బుచ్చిబాబు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బుచ్చిబాబు మంత్రి దుర్గేష్‌కు సూచించారు. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.