ప్రకాశం: మైనంపాడులోని ప్రభుత్వ టీచర్ల శిక్షణ కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి రంగోత్సవ పోటీలు నిర్వహించారు. మొత్తం 8 నిమిషాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏఎస్పీ అశోక్ బాబు మాట్లాడుతూ రంగోత్సవ్ పోటీలతో మానసిక వికాసం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు పాల్గొన్నారు.