అన్నమయ్య: గుర్రంకొండ మండలంలో పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పీలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.